వాస్విక్ ఫౌండేషన్ ఆరో వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. కట్కూరు గ్రామంలోని హై స్కూల్ మరియు ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు న్యూట్రిషన్ జ్యూస్ ప్యాకెట్ల పంపిణీ చేయడం జరిగింది. పిల్లల ఆరోగ్యం, శారీరక ఎదుగుదల మరియు పోషకాహారంపై అవగాహన పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టబడింది. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు ఆనందంగా స్వీకరించడం మా ఫౌండేషన్‌కు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది. సమాజ సేవలో మా ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది.


